గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 10 మార్చి 2021 (15:37 IST)

నిన్ను చూసి వాడెందుకు నవ్వాడు, ఇక ఆరోజు రాత్రి నిద్రపోనీయడు, చివరకి...

భర్త అందగాడు కాదు. కానీ అతడి భార్య మాత్రం సన్నగా నాజూగ్గా ఉంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు. భర్తే సర్వస్వం అని భావించే భార్య. కానీ భర్తకు మాత్రం ఆమెపై ఎప్పుడూ అనుమానమే. అందమైన భార్య తనతో జీవితాంతం కాపురం చేస్తుందా.. లేకుంటే వేరే ఎవరితోనైనా కలుస్తుందా అన్న అనుమానం అతని మనస్సులో మెదిలింది. 
 
ఆమెతో నవ్వుతూ ఎవరు మాట్లాడినా ఇక ఆరోజు రాత్రి నిద్రపోడు. అతడు నిన్ను చూసి ఎందుకు నవ్వాడు అంటూ వేధింపులు ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు తన కొంప మునిగిపోయిందన్నట్లు గెడ్డం పెంచుకుని దేవదాసు అవతారం ఎత్తుతాడు. అతడి అనుమానం, వేధింపుల కారణంగా కుటుంబం చిన్నాభిన్నమైంది. 
 
కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకు దేశవళ్ళి ప్రాంతానికి చెందిన రంగప్ప, ఆశాలకు ఆరేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంగప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి. పెద్దలు కుదిర్చిన పెళ్ళే చేశారు. రంగప్ప నల్లగా ఉంటాడు. ఆశ మాత్రం ఎంతో అందంగా ఉంటుంది.
 
అందంగా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. భార్య అందంగా వుండటంతో రంగప్పకు ఆమెపై అనుమానమే. ఎన్నోసార్లు భార్యను నిలదీశాడు. నువ్వు టిప్ టాప్‌గా రెడీ అవుతూ బయటకు వెళుతున్నావు. బయట చూసేవారు ఇంకేమైనా అనుకుంటారని గొణిగేవాడు. ఎవరైనా పలుకరింపుగా నవ్వుతూ మాట్లాడితే... వాడు నీతో అలా ఎందుకు నవ్వుతూ మాట్లాడాడు అంటూ వేధించేవాడు.
 
మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి అంటూ ఎన్నోసార్లు భార్య నచ్చజెప్పింది. అయినా రంగప్పలో మాత్రం అనుమానం పోలేదు. భార్య తనను మోసం చేస్తోందని.. తను ఊళ్లలో తిరిగేటప్పుడు ఎవరితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. తన బావ చంద్రతో కలిసి భార్యను చంపేద్దామని ప్లాన్ చేశాడు.
 
ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. భార్యను సెకండ్ షో సినిమాకు తీసుకెళ్ళాడు. మార్గమధ్యంలో మూత్రం వస్తోందని స్కూటర్ ఆపాడు. ఆ తరువాత ప్లాన్ ప్రకారం వెనుక నుంచి చంద్ర ఆమె తలపై గట్టిగా రాడ్‌తో కొట్టాడు. కిందపడిపోయింది ఆశ. ఇద్దరూ కలిసి ఆమెను అతి దారుణంగా చంపేసి దగ్గరలో ఉన్న చెరువులో పడేశారు.
 
ఇంటికి వచ్చేసిన రంగప్ప ఏమీ తెలియనట్లు భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగప్ప మీదే అనుమానంతో ఉన్న ఆశ తండ్రి అతన్ని విచారించాలని కోరాడు. పోలీసులు తమదైన విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.