Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 స్టంట్ చేయబోయాడు.. ఏనుగు విసిరికొట్టింది (వీడియో)

మంగళవారం, 14 నవంబరు 2017 (11:03 IST)

Widgets Magazine

బాహుబలి 2 సినిమాలో తొలి పాటలో ప్రభాస్ ఏనుగు తొండంపై నిల్చుంటాడు. అలాంటి స్టంట్‌ను రియల్‌గా చేయాలనుకున్న ఓ యువకుడు చావుకోరలు వరకు వెళ్లొచ్చాడు. ఫలితంగా చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ఆస్పత్రి పాలైయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఇడుక్కి థోడుపూఝాలో బాహుబలి-2లో ప్రభాస్ చేసిన విన్యాసం చేస్తానని.. తన స్నేహితుడ్ని వీడియో తీయాలని కోరాడు. దానికి అంగీకరించిన ఆ యువకుడు వీడియో తీయడం మొదలు పెట్టాడు. దీంతో సాహసం చేయాలనుకున్న యువకుడు ఒక ఏనుగు దగ్గరకి వెళ్లి దానికి అరటిపండు అందించాడు.
 
దానిని అది ఆనందంగా అందుకుంది. తరువాత దాని తలపై సుతారంగా ముద్దు పెట్టాడు. అప్పుడు కూడా మౌనంగా ఉంది. అంతటితో ఆగకుండా.. మెల్లగా దాని దంతాలు పట్టుకుని పైకెక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ఏనుగుకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అంతే తొండంతో ఆ యువకుడిని నేలకేసి విసిరికొట్టింది.

క్షణమాగితే ప్రాణాలు పోయేవే.. కానీ వీడియో తీస్తున్న యువకుడు వేగంగా స్పందించి, అతనిని రక్షించి, గాయాలపాలైన అతనిని ఆసుపత్రిలో చేర్చాడు. దీంతో చావుతప్పి చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడు బాహుబలి-2 స్టంట్ ఎలా చేశాడో ఈ వీడియోలో చూడొచ్చు.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్లాస్టిక్ క్యాన్ సాయంతో ఈతరాకపోయినా నదిని దాటేసిన బాలుడు

మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ ...

news

ఇవాంకా ట్రంప్ రాకతో బిచ్చగాళ్లను కష్టకాలం... ఎక్కడ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28, 29వ తేదీల్లో భారత ...

news

'బాహుబలి' స్టంట్‌కి కేరళ యూత్ యత్నం.. క్షణాల్లో గాల్లో... (వీడియో)

'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌ ఉంది. అచ్చం ఇదే ...

news

భారత్ భద్రతపై నమ్మకం లేదట... ఇవాంక కోసం వైట్‌హౌస్ బలగాలు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఈనెలాఖరులో భారత పర్యటనకు ...

Widgets Magazine