Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి' స్టంట్‌కి కేరళ యూత్ యత్నం.. క్షణాల్లో గాల్లో... (వీడియో)

మంగళవారం, 14 నవంబరు 2017 (10:25 IST)

Widgets Magazine
baahubali stunt

'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్ ఏనుగు తొండంపై కాలు పెట్టి పైకి ఎక్కే సీన్‌ ఉంది. అచ్చం ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ యువకుడే చేసేందుకు ప్రయత్నించాడు. అంతే, కొన్ని క్షణాల్లో గాల్లో ఎగిరిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళలో ఇడుక్కి జిల్లాలలోని థోడుపూళా అనే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బాహుబలి స్టంట్ చేయాలని భావించాడు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఏనుగుకు అరటిపండు అందించాడు. ఆ తర్వాత ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. 
 
ఇంకేముంది ఏనుగుకు తిక్కలేవడంతో ఒక్కసారిగా అతన్ని తొండంతో విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. ఈ ఘటనంతా వీడియో తీస్తున్న యువకుడి స్నేహితుడు అతన్ని ఏనుగు బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చిక్సితనందిస్తున్నారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్ భద్రతపై నమ్మకం లేదట... ఇవాంక కోసం వైట్‌హౌస్ బలగాలు?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తె ఇవాంక ట్రంప్ ఈనెలాఖరులో భారత పర్యటనకు ...

news

మహిళా కానిస్టేబుల్‌తో బాడీ మసాజ్ : ఓ ఏఎస్ఐ నిర్వాకం

గద్వాల్ జిల్లాలో ఓ ఏఎస్ఐ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా కానిస్టేబుల్‌లో బాడీ మసాజ్ ...

news

ఇంకా పెళ్లికాలేదు.. అలాగనీ నేను నపుంసకుడినికాను.. హార్దిక్ పటేల్

గుజరాత్‌ టీవీ చానెళ్లలో పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ...

news

బెల్ట్ షాపులున్నాయని చెబితే అర్థగంటలో మూయించేస్తాం: మంత్రి జవహర్

అమరావతి: రాష్ట్రంలో 100 శాతం బెల్ట్ షాపులు మూయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి ...

Widgets Magazine