Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి పెంపుడు తండ్రి ఇంత పనిచేశాడా? ప్రేమ పేరుతో లోబరుచుకుని..?

గురువారం, 9 నవంబరు 2017 (13:19 IST)

Widgets Magazine

బాహుబలిలో ప్రభాస్‌కు పెంపుడు తండ్రిగా, గరుడవేగలో సీఎం పీఏ నటించిన ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) అరెస్టయ్యాడు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలో నివాసముండే ఓ మహిళ (33) ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పనిచేస్తోంది.
 
పది సంవత్సరాల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె.. విడాకుల కోసం ఆమె దాఖలు చేసిన కేసు కోర్టులోనడుస్తోంది. ఆ మహిళపై కన్నేసిన వెంకటప్రసాద్ ప్రేమిస్తున్నానని నమ్మబలికి.. విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు.
 
ఈ క్రమంలో ప్రసాద్ సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకున్నాడు. ఇంతలో బాధిత మహిళకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. వెంకట ప్రసాద్‌ను వివాహం చేసుకోవాలని మహిళ ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడు. అంతేగాకుండా వేరొక యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అతడు అనేకమంది యువతులను ప్రేమ పేరిట మోసం చేసినట్లు తేలింది. దీంతో 420, 506,509, 354(డి) కింద కేసులు నమోదు చేసి వెంకట్‌ను అరెస్టు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ వృద్ధుడితో నేను నటించనంటున్న మిల్కీ బ్యూటీ

బాహుబలి భారీ విజయం తరువాత తమన్నాకు కాస్త పొగరు బాగానే పెరిగిందని తెలుగు సినీవర్గాలు ...

news

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎక్కువ మార్కులు ఎవరికి?

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎవరికి మార్కులొస్తాయని.. నెటిజన్లు బెట్ కడుతున్నారు. ఇంతకీ.. ...

news

v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?

తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను ...

news

పద్మావతి, అల్లావుద్దీన్‌‌ల మధ్య శృంగార సన్నివేశాలా?

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన తాజా చిత్రం "పద్మావతి". ఈ చిత్రం విడుదలకు ...

Widgets Magazine