శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 20 డిశెంబరు 2017 (21:31 IST)

'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ప్రోగ్రాం యాంకర్‌కి యావజ్జీవ కారాగారం... ఎందుకు?

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదం

2000 సంవత్సరంలో ఆ టీవీ యాంకర్ పైన హత్య అభియోగాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అనే ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా సుహైబ్ ఇలియాసీ గతంలో పనిచేసేవాడు. ఐతే అతడి భార్య 2000 సంవత్సరంలో అనుమానస్పద రీతిలో మృతి చెందింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు తన అల్లుడే వేధించి హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కోర్టుకు వెళ్లింది. 
 
తొలుత విచారణ చేపట్టి అతడిపై 304 బి సెక్షన్ కింద అభియోగాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన ట్రయిల్ కోర్టు అతడిపై 302 సెక్షన్ కింద హత్య అభియోగాన్ని నమోదు చేసింది. తాజాగా అడిషనల్ సెషన్స్ కోర్టు విచారణ జరిపి, భార్యను హత్య చేసింది నిజమేనంటూ అభిప్రాయపడింది. అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. కాగా సుహైబ్ భార్య 2000 జనవరి 11న మరణించింది.