శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:39 IST)

డ్రగ్స్ చిక్కుల్లో ఫేమస్ డాన్స్ మాస్టర్

బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రముఖ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన వ్యక్తి, ప్రముఖ టీవీ చానల్‌లో డ్యాన్స్ ఇండియ డ్యాన్స్ అంటూ హంగామా చేసిన డ్యాన్స్ మాస్టర్‌ను పక్కా వల వేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ మిక్స్ చేసిన మాత్రలు రాత్రి సేల్స్ బాయ్‌లా విక్రయిస్తూ వాటిని ఉపయోగిస్తున్న డ్యాన్స్ మాస్టర్‌ను విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతనితో ఇంకా ఎవరెవరికి లింక్ ఉంది అంటూ విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నారు.
 
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో కలిసి ఈ డ్యాన్స్ మాస్టర్ బాలీవుడ్ సినిమా ABCDలో నటించాడు. 2013లో విడుదలైన బాలీవుడ్ సినిమా ABCD (Any Body Can Dance) సినిమాలో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటించారు. ఏబీసీడీ సినిమాకు రెమో డిసౌజ దర్శకత్వం వహించడంతో పాటు ఆయన కూడా ఈ సినిమాలో నటించారు.
 
ABCD సినిమాలో ప్రభుదేవా, రెమో డిసౌజ, గణేష్ ఆచార్య, తదితరులు నటించారు. ABCD సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. శ్యాండిల్‌వుడ్, బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ అమన్ అలియాస్ కిశోర్ శెట్టి కూడా ABCD సినిమాలో నటించాడు. ప్రభుదేవా, రిమో డిసౌజ తదితరులతో నటించిన డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
అంతేకాకుండా ప్రముఖ హిందీ టీవీ చానల్ జీ టీవీ నిర్వహించిన డ్యాన్ ఇండియా డ్యాన్ రియాలిటీ సీజన్-2లో పాల్గొన్న కిశోర్ శెట్టి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యాడు. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో శ్యాండిల్‌వుడ్ స్టార్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ, రవిశంకర్, వీరేన్ ఖన్నా, రాహుల్ తదితరులు అరెస్టయి జైలుపాలైన విషయం తెలిసిందే.
 
డ్రగ్స్ మాఫియాతో రాగిణి, సంజనాతో పాటు కొందరు సంగీత దర్శకులు, డ్యాన్స్ మాస్టర్స్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టిని మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ శెట్టికి మరో రూపం ఉందని పోలీసులు గుర్తించారు.
 
డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి మాత్రలు(Drugs) విక్రయిస్తున్నాడని సమాచారం అందడంతో మంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పక్కా ప్లాన్‌తో అతన్ని అరెస్టు చేశారు. బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసు విషయంలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల మంగళూరుకు వెళ్లిన డీజీపీ ప్రవీణ్ సూద్ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు.
 
ఇదే సమయంలో డ్రగ్స్ దందా కేసులకు సంబంధించి ప్రముఖ టీవీ యాంకర్ అకుల్ బాలాజీతో పాటు మరో ముగ్గురికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇప్పుడు డ్రగ్స్ మాఫియా దందా కేసులో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కిశోర్ శెట్టి అరెస్టు కావడంతో అతని డ్రమ్ పగిలిపోతుందని తెలిసింది.