మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (10:59 IST)

కోమాలోకి జారుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ?

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే వుంది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల కరోనా వైరస్ సోకిన ఆయన.. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో 84 యేళ్ళ ప్రణబ్‌ ముఖర్జీ కోమాలో ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపాయి. వెంటిలేటర్‌ సపోర్ట్‌ కొనసాగిస్తున్నట్లు వివరించాయి. కాగా, ప్రణబ్‌ ఆరోగ్యంలో స్వ ల్పంగా మెరుగుదల కనిపించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో చిన్నపాటి క్లాట్ ఏర్పడటంతో ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సిేర్పి వచ్చింది.