గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 జూన్ 2018 (13:23 IST)

కన్నబిడ్డను రేప్ చేశాడు.. కేసుపెట్టిందనీ భార్యను చంపేశాడు.. ఎక్కడ?

అభంశుభం తెలియని కన్నబిడ్డపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసి భర్తపై భార్య కేసుపెట్టింది. తనపైనే భార్య కేసు పెట్టిందన్న అక్కసుతో ఇపుడు ఏకంగా ఆమెనే హత్య చేశాడు. అదీకూడా కోర్టు ప్రాంగణంలోనే. ఈ దా

అభంశుభం తెలియని కన్నబిడ్డపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విషయం తెలిసి భర్తపై భార్య కేసుపెట్టింది. తనపైనే భార్య కేసు పెట్టిందన్న అక్కసుతో ఇపుడు ఏకంగా ఆమెనే హత్య చేశాడు. అదీకూడా కోర్టు ప్రాంగణంలోనే. ఈ దారుణం అస్సాం రాష్ట్రంలోని డిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ ప్రాంతానికి చెందిన పూర్ణ నహర్‌ డేకా అనే వ్యక్తి తన కుమార్తెపై గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఇటీవల బెయిల్‌‌పై విడుదలయ్యాడు. కానీ, కేసు విచారణ మాత్రం డిబ్రూగఢ్ సెషన్స్ కోర్టులో సాగుతోంది. ఈ కేసులో ఫిర్యాదుదారుగా నిందితుడి భార్య రీటా నహర్ దేకా కోర్టు హాజరై సాక్ష్యం చెప్పేందుకు బోనులో నిలబడింది. 
 
దీంతో అకస్మాత్తుగా నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత కోర్టు సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.