శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 జూన్ 2023 (14:23 IST)

ఆధార్‌లో ఉచిత మార్పులు చేర్పులకు గడువు పొడగింపు

aadhaar card
ఆధార్ కార్డులో ఉచిత మార్పులు చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ విధించిన గడువును మరోమారు పొడగించింది. ఆధార్ కార్డును పొంది పదేళ్లు దాటినవారు తమ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా ఈ ఉచిత అవకాశాన్ని కల్పించింది. అయితే, ఈ గడువు మార్చి 15వ తేదీ నుంచి తొలిసారి కల్పించింది. ఈ గడువు ఈ నెల 14వ తేదీతో ముగిసింది. 
 
అయితే, చాలా మంది ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోలేదు. దీంతో ఆధార్ సమీకరణ చేసుకోని వారంతా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఈ గడువును సెప్టెంబరు 14వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు యూఐడీఏఐ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే విధిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 
 
యూఐఏడీఐ నింబంధనలకు లోబడి మై ఆధార్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లలో కూడా నవీకరించుకునే వెసులుబాటును కల్పించింది. పేరు, పుట్టిన తేదీ చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫోటోను కూడా అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.