మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (11:38 IST)

ఖుష్బూ ఓ బ్రోకర్... సంస్కార హీనురాలు : గాయత్రీ రఘురాం

సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత ఖుష్బూపై బీజేపీ నేత, నటి, నృత్య దర్శకురాలు అయిన గాయత్రీ రఘురాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఖుష్బూను ఓ బ్రోకర్‌గా గాయత్రీ రఘురాం అభివర్ణించారు. 
 
అసలు వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి గల కారణాలను పరిశీలిస్తే, గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం అంతా హిందీలో కొనసాగింది. 
 
దీనిపై కాంగ్రెస్ మహిళా నేతగా ఉన్న సినీ నటు ఖుష్బూ మాట్లాడుతూ, ప్రాచీన భాషగా ఉన్న తమిళంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. 
 
దీనిపై గాయత్రీ రఘురాం తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఆమె సంస్కార హీనురాలనీ, పైపెచ్చు ఓ బ్రోకర్ అంటూ ఘాటైన పదజాలంతో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.