బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుందని కుమార్తెను హత్య చేసిన తల్లి

Last Updated: ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (17:37 IST)
తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లి కన్నబిడ్డను హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. పైగా, హత్య కేసులో ఇరుక్కోకుండా ఆధారాలను మాయం చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఘజియాబాద్‌లో ఒక యువతి మృతదేహాన్ని బైక్‌పై కొందరు తీసుకువెళుండటాన్ని గమనించిన సంగమ్ విహార్‌వాసులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు విషయాలు వెల్లడించారు. ఓ యువతి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 42 యేళ్ల మహిళ కూడా ఉంది.

ఆమె పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది. తన కుమార్తె బాయ్‌ప్రెండ్‌తో తిరుగుతుండటాన్ని గమనించి, గత మూడు నెలల్లో 8 అద్దె ఇళ్లను మార్చామని, అయినప్పటికీ తన కుమార్తె తీరులో మార్పురాలేదని వాపోయింది. ఈ కారణంగానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించింది. తన కుమారుడు స్నేహితులతో కలిసి మృతదేహాన్ని తరలిస్తుండగాచిక్కినట్టు వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :