1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (15:45 IST)

ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేయనివ్వం.. గూగుల్, ఎఫ్‌బీ, ట్విట్టర్

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోసోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఈ మేరక

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోసోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాలు వెల్లడించాయి. ఈ మేరకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనరు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని సంఘం గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్ల ప్రాంతీయ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ప్రజలను ప్రభావితం చేసేలా తప్పుడు వార్తలు సదరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కాకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు చేపడతారంటూ ప్రశ్నించగా.. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవని.. తాము కట్టుదిట్టమైన చర్యలు చేపడతామంటూ సోషల్ మీడియా ప్రతినిధులు ఉమేష్‌ సిన్హా సారథ్యంలోని కమిటీకి హామీ ఇచ్చినట్లు రావత్ చెప్పారు.
 
పోలింగ్‌‌కు 48 గంటల ముందు నుంచీ తమ సామాజికమాధ్యమాలపై ఎన్నికల సంబంధ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఎన్నికల సమయంలో తమ సామాజిక  వేదికలపై అయిన వ్యయం వివరాలు సైతం ఎన్నికల సంఘంతో నేరుగా పంచుకునేందుకు వీలుకల్పించే ఓ వ్యవస్థను కూడా గూగుల్‌ ఏర్పాటు చేయనుందని రావత్ వెల్లడించారు.