పాతవాహనదారులకు షాక్... రెన్యువల్ ధర భారీగా పెంపు
దేశంలో పాత వాహనాల వాడకాన్ని తగ్గించడంపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ దృష్టిసారించింది. ఇందులోభాగంగా, 15 సంవత్సరాలు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ధరను పెంచుతూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వచ్చే అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యూవల్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లకు రేట్లు పెరగనున్నాయి. 15 ఏళ్లు పైబడిన టూవీలర్లకు రెన్యూవల్ ధరను రూ.1,000గా ఫిక్స్ చేసింది.
త్రీవీలర్లకు రూ.3,500.. లైట్ మోటార్ వెహికిల్స్‌కు రూ.7,500గా నిర్ణయించింది. మీడియం గూడ్స్ ప్యాసింజర్ వెహికిల్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం రూ.10 వేలు.. అదే హెవీ గూడ్స్ లేదా లార్జ్ ప్యాసింజర్ మోటార్ వెహికిల్స్‌కు రూ.12,500గా చొప్పున చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.