శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (14:37 IST)

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

tablets
మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణంగా ఉపయోగించే మందులు ధరలను ప్రభుత్వం తగ్గించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్- నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, టాసిడ్‌లు, మల్టీవిటమిన్‌లు, యాంటీబయాటిక్‌లు చౌకగా లభించే మందులలో ఉన్నాయి.
 
 వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే అందజేయాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. 
 
నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పిపిఎ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.  
 
గత నెలలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చింది.