సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (11:53 IST)

పెళ్లిలో రిటర్న్ గిఫ్టులుగా లిక్కర్ బాటిళ్లు...

పెళ్లిళ్లకు వెళ్తే.. రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తుంటారు. రిటర్న్ గిఫ్టులుగా, వస్తువో లేకుంటే వారి వారి స్థాయికి తగినట్లు ఇస్తుంటారు. అయితే ఇక్కడి పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 
 
పుదుచ్చేరిలోని ఓ వివాహ వేడుకలో తాంబూలాల బ్యాగులో క్వాటర్ లిక్కర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఈ ఘటనపై కొందరు తేలికగా తీసుకున్నా.. మరికొందరు మాత్రం సీరియస్‌గా స్పందిస్తున్నారు. 
 
పెళ్లిలో రిటర్న్ గిఫ్టులుగా లిక్కర్ బాటిళ్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.