Widgets Magazine

ఈపాడులోకం కలిసి బతకనివ్వట్లేదు.. ఈలోకాన్ని విడిచిపోతున్నాం....

మంగళవారం, 12 జూన్ 2018 (13:34 IST)

మా ఇద్దరి అభిరుచులు ఒక్కటైనప్పటికీ తమను ఈ పాడులోకం కలిసి బతకనివ్వడం లేదని పేర్కొంటూ ఓ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. సబర్మతీ నదిలో దూకి ఈ జంట చేసుకుంది. వీరితోపాటు ఓ పసిబిడ్డను కూడా తీసుకెళ్లారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..
Gujarat lesbian couple
 
గుజరాత్ రాష్ట్రంలోని బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదేప్రాంతానికి చెందిన భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. వీరిద్దరి భర్తలూ దూరమయ్యారు. దీంతో ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఇద్దరూ కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ, త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. 
 
అయితే గ్రామ పెద్దలు మాత్రం వీరికి అడ్డుచెప్పారు. దీంతో భావన, ఆశా తన కూతురు మేఘాను తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఊరి నుంచి వెళ్లిపోయారు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ అనూహ్యాంగా నదిలో శవాలై కొట్టుకొచ్చారు. 
 
సోమవారం సబర్మతి నదీ తీరంలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చిందని గుజారీ బజార్‌ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా, మరో శవంతో పాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గుర్తించారు. కానీ ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయింది. 
 
వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేముందు 'కలిసి బతికేందుకే ఈ లోకాన్ని విడిచిపోతున్నాం. మాకు ఏ మగతోడు లేదు. ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి దగ్గరయ్యాం. కానీ, ఆ సమాజం మమల్ని ఒక్కటిగా బతకనివ్వట్లేదు. అందుకే కలిసి చావాలనుకుంటున్నాం. బహుశా ఇక మేం ఒకటిగా బతికేది వచ్చే జన్మలోనే' అంటూ సూసైడ్‌‌లో రాసిపెట్టారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#TrumpKimSummit : యుద్ధ నేపథ్య వేదికపై ట్రంప్ - కిమ్ చర్చలు.. ఎలా?

అమెరికా, ఉత్తరకొరియా అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ శిఖరాగ్ర సదస్సు ...

news

ఆమెను విడిచి ఉండలేనంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

పరాయి వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు.. ఆమెను విడిచి ఉండలేనంటూ ...

news

'భారతరత్న' వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ...

news

'ఇమ్రాన్ ఒక గే'.. వసీం అక్రమ్ ఆ పని చేయించాడు : రేహమ్ ఖాన్

పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్‌సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు ...

Widgets Magazine