ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:21 IST)

'అమ్మ'ను ఆస్పత్రిలో ఒక్కసారి కూడా చూడలేదు.. అమెరికాకు తీసుకెళ్దామంటే...

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఒక్కసారి కూడా చూడలేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చే

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను ఒక్కసారి కూడా చూడలేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, అమ్మకు మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకెల్దామంటే అపోలో ఆస్పత్రి యాజమాన్యం వద్దని చెప్పిందని ఆయన ఆరోపించారు.
 
గత 2016 డిసెంబరు నెలలో జయలలిత చనిపోగా, ఆమె మృతి ఓ మిస్టరీగా మారింది. దీనిపై ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ యేడాది పూర్తి చేసుకున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, డీఎంకేకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో పాల్గొన్న పన్నీర్ సెల్వం... జయలలిత ఆస్పత్రిలో ఉన్నంతకాలం తాను ఆమెను ఒక్కసారి కూడా చూడలేదని వ్యాఖ్యానించారు.
 
అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అపోలో వైద్యులను తాను అనేకసార్లు అడిగానని... మరింత మెరుగైన వైద్యం అవసరమనుకుంటే ఆమెను విదేశాలకు తరలించాలని ఆస్పత్రి యాజమాన్యానికి సూచించానని ఓపీఎస్ చెప్పారు. అయితే ఇందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించలేదని చెప్పారు. జయలలిత తమ ఆధ్వర్యంలోని చికిత్సతో కోలుకుంటారని వారు చెప్పినట్టు పన్నీరు సెల్వం తెలిపారు. పన్నీరు సెల్వం సరికొత్త వ్యాఖ్యలపై అన్నాడీంకేలో సరి్కొత్త చర్చ మొదలైంది.