సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (15:35 IST)

మండిపోతున్న ఎండలు.. వేసవి సెలవులు పొడగింపు

tn students
తమిళనాడు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను పొడగించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఇచ్చారు. జూన్ ఒకటో తేదీ స్కూల్స్ తెరుచుకుంటాయని ప్రకటించారు. అయితే, వేసవి ఎండలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ సెలవులను తొలుత వారం రోజుల పాటు పొడగించారు. అంటే ఏడో తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించారు. 
 
అయినప్పటికీ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మరో వారం రోజుల పాటు ఈ సెలవులను పొడగించింది. ఆ ప్రకారంగా ఈ నెల 14వ తేదీ బుధవారానికి వాయిదా వేసింది. 
 
2023-24 విద్యా సంవత్సరానికిగాను ఆరు నుంచి పది తరగతులకు, ఇంటర్ విద్యార్థులకు మాత్రం జూన్ 12వ తేదీన, 1 నుంచి 5వ తరగతులకు చెందిన విద్యార్థులకు జూన్ 14వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖామంత్రి అన్బిల్ మహేశ్ వెల్లడించారు.