శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (12:12 IST)

మద్యం తాగి కుంభకర్ణుడిలా నిద్రపోయిన గజరాజులు.. ఎక్కడంటే?

Elephant
Elephant
మద్యం మత్తు గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. మద్యం తాగితే మనుషులు అదో రకంగా ప్రవర్తిస్తారు. అదే ఏనుగులు మందు తాగితే పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. అవును ఇదే జరిగింది. 
 
గజరాజులు తప్ప తాగి కుంభకర్ణుడిలా నిద్రపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఒడిశాలో గిరిజనులు తయారు చేసిన మద్యం తాగి ఏనుగులు హాయిగా గురకపెట్టి నిద్రపోతున్నాయనే వార్త వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని కియోంజర్ జిల్లా శిలిపాడ ముండ్రి అటవీ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నారు. ఇలుపాయి అనే ఓ రకమైన పువ్వును 'మహువా' అనే మద్యాన్ని తయారుచేసే అలవాటు ఈ వ్యక్తులకు ఉంది. ఇందుకోసం ముండ్రికాడు ప్రాంతంలో ఇలుపాయి పూలను పెద్ద కుండీల్లో నీళ్లలో నానబెడతారు. ఆపై మద్యం తయారు చేస్తారు. 
 
అయితే ఆరోజు గిరిజనులు తయారు చేసి వుంచిన మద్యం కుండీలు పగలగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యారు ఆ జనం. అంతేగాకుండా దాని పక్కనే 24 ఏనుగులు హాయిగా నిద్రపోవడాన్ని గమనించారు.  వాటిని లేపేందుకు ప్రయత్నించినా నిద్ర లేవలేదు. 
 
చివరికి అవి కుండలోని మద్యాన్ని సేవించడంతోనే గజరాజులు నిద్రపోతున్నాయనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.