గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (15:54 IST)

చెన్నై ఆస్పత్రి రెస్ట్‌రూమ్‌లో కెమెరా..? దుస్తులు మార్చుకునేందుకు వెళ్తే..?

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మహిళల రెస్ట్ రూమ్‌లోని బాత్రూమ్‌లో రహస్య కెమెరాలను వుంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఇటీవల ఓ లేడీస్ హాస్టల్‌లో రహస్య కమెరాలను వుంచడాన్ని స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా అదే హాస్టల్‌లో బసచేసే యువతులు కనిపెట్టారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ నేపథ్యంలో చెన్నై సైదాపేటలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి, లేడీస్ రెస్ట్‌రూమ్‌లో రహస్య కెమెరాలను వుంచిన వ్యవహారం బయటపడింది. రెస్ట్‌రూమ్ దుస్తులు మార్చేందుకు వెళ్లిన ఓ మహిళ ఈ విషయాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఆ హోటల్‌లో పనిచేసే వ్యక్తులే రెస్ట్ రూమ్‌లో కెమెరాను వుంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.