గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (16:44 IST)

హిమాలయన్ క్వీన్స్‌లో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్

హిమాలయన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కానీ, ఈ రైలులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కుమార్‌హటి - సహరన్‌పూర్‌ల మధ్య 52455 అనే నంబరుతో హిమాలయన్ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. 
 
ఈ రైలు కల్కసిమ్లా హెరిటేజ్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్ రైలు సేఫ్టీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికుల బోగీల నుంచి రైలింజన్‌ను తొలగించారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. 
 
కాగా, ఈ రైలు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 7 బోగీల్లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరందరినీ సురక్షితంగా రైల్వే అధికారులు సిమ్లాకు చేర్చారు.