శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (07:30 IST)

దేశంలో 100 శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. ఈ ప్రక్రియ ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హిమాలయా పర్వతశ్రేణుల్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వందకు వందశాతం డబుల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీంతో వంద శాతం డబుల్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన తొలి రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్ అవతరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారులు స్పందిస్తూ, రాష్ట్రంలో వంద శాతం మందికి కోవిడ్ డోసులు అందజేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కార్యాచరణ కారణంగానే రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలిగినట్టు చెప్పారు. 
 
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ కూడా ప్రశంసించారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం బిలాస్‌పూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి.