ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (23:18 IST)

అసదుద్దీన్ ఇంటిపై హిందూ సేన దాడి

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు.

ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలోకి చొచ్చుకు వచ్చిన హిందూ సేన కార్యకర్తలు ఇంటి తలుపు, నేమ్ ప్లేట్‌, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు.

కాగా, దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను తమ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని హిందూ సేన అధినేత విష్ణు గుప్త తెలిపారు.

దాడికి గురైన బంగ్లా.. ఎంపీగా ఓవైసీకి కేటాయించిన అధికారిక బంగ్లా. ఇంటి గేటుతో పాటు, అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ముక్కల్ని ఇంటి ఆవరణలో చెల్లాచెదురుగా పడేశారు.