మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (08:46 IST)

ఆర్ఆర్‌బి పరీక్షపై ఆగ్రహం : గయలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

బిహార్ రాష్ట్రంలో ఆర్ఆర్‌బి ఉద్యోగ రాత పరీక్ష రాసిన అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఆందోళన హింసాత్మకంగా మారింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) మాట మార్చిందంటూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చివరకు హింసకు దారితీసి ఓ రైలుకు నిప్పు పెట్టారు. 
 
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ పరీక్ష 2021, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) 2019 కోసం నోటిఫికేషన్ జారీచేసింది. లెవల్-2 నుంచి లెవల్-6 వరకు మొత్తం 35 వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షా ఫలితాలను ఇటీవల వెల్లడించారు. ఇందులో అభ్యర్థుకు మరో పరీక్ష నిర్వహిస్తామని రైల్వే శాఖ ప్రకటించడమే ఈ ఆందోళనకు కారణమైంది. 
 
ప్రధాన నోటిఫికేషన్‌లో ఒకే పరీక్ష అని చెప్పి ఇపుడు మరో పరీక్ష అంటారా? అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. గయలో భభువా - పాట్నా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మరికొన్ని రైళ్లపై రాళ్ళతో దాడి చేశఆరు. జెహనాబాద్‌లో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 
 
అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అభ్యర్థులు మూడు రోజుల్లో తమ సలహాలు, సందేహాలను ఈ కమిటీకి తెలియజేయాలని కోరింది. అలాగే రైల్వే ఆస్తులను ధ్వంసానికి పాల్పడిన అభ్యర్థులను వారి జీవితాంతం పరీక్షలు రాయలకుండా అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించింది.