సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడు..

murderer
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కూరలో ఉప్పు తక్కువైందన్న కోపంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ రాష్ట్రంలోని కలాన్‌ గ్రామానికి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భార్య వంట చేసింది. 
 
అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో కూరలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మరింత కోపంతో ఊగిపోయిన భర్త.. ఆమెను కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.