సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:36 IST)

భార్య నల్లగా వున్నావంటూ భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

భార్య నల్లగా వున్నావంటూ భర్త హింసించేవాడు. అయితే భర్త వేధింపులకు కంట్రోల్ తప్పింది. ఆదివారం రాత్రి కూడా భర్తతో గొడవ జరిగింది. భర్త పడుకున్న తర్వాత.. ఒక గొడ్డలి తీసుకుంది. అతనిపై ఇష్టమొచ్చినట్లు దాడిచేసింది. అంతేకాకుండా... భర్త పురుషాంగాన్ని కూడా కోసేసింది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో షాకింగ్ జరిగింది. స్థానికంగా అమలేశ్వర్ గ్రామంలో అనంత్ సోన్వానీ తన భార్య సంగీతతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు మొదట్లో బాగానే కలిసి ఉండేవారు. 
 
అయితే.. కొన్నిరోజులుగా అనంత్ తన భార్యను నల్లగా ఉన్నావంటూ వేధిస్తుండేవాడు. ఆమె శరీరంపై మచ్చలున్నాయని టార్చర్ చేసేవాడు. తరచుగా అసభ్యంగా పిలిచేవాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో ఆమె భర్త వేధింపులకు కంట్రోల్ తప్పింది. 
 
ఆ తర్వాత.. ఏం తెలియనట్లు పడుకుంది. ఉదయాన్నే తన భర్తను ఎవరో చంపేశారని కొత్త నాటకానికి తెరలేపింది. అయితే.. అక్కడికి చేరుకున్న పోలీసులు భార్య కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.