1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఎల్జీగారు... నేను ఉగ్రవాదిని కాదు.. ఢిల్లీ సీఎంను : కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజాల్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్ బైజాల్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. కాంట్రాక్ట్ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ బుధవారం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకించారు. అయినప్పటికీ ఢిల్లీ ఆప్ సర్కారు ఈ బిల్లును పాస్ చేసింది. ఫలితంగా తాజా వివాదానికి కారణమైంది. 
 
ఢిల్లీ సర్కారు 1500 మందిని కాంట్రాక్ట్ టీచర్లుగా నియమించింది. వీరిలో 500 మందిని క్రమబద్దీకరిస్తూ ఓ బిల్లును రూపొందించి అసెంబ్లీలో పాస్ చేసింది. అయితే, 500 మంది టీచర్లను రెగ్యులరైజ్ చేసే బిల్లు విషయంలో మరోసారి ఆలోచించాలని ఎల్జీ అనిల్ బైజాల్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, ఉగ్రవాదిగా కాదంటూ ఆక్రోశించారు. 
 
ఇదే అంశంపై సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, బ్యూరోక్రాట్లపైనా విరుచుకుపడ్డారు. మనం ఢిల్లీ నేతలమని (మాస్టర్స్), బ్యూరో‌క్రాట్లంకామని తేల్చి చెప్పారు. దేశం ప్రజాస్వామ్యంపై నడుస్తోందని, బ్రూరోక్రసీపై కాదనగానే ఆప్ ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, ఉగ్రవాదిగా కాదని, అతడు (సిసోడియా) విద్యాశాఖ మంత్రి అని, ఉగ్రవాది కాదని సీఎం తేల్చి చెప్పారు.