నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించా: సన్నీలియోన్  
                                       
                  
                  				  కావాలని చేసినా, పొరబాటున చేసినా చాలాసార్లు సమాజం కట్టుబాట్లను తాను ధిక్కరించానని ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ వెల్లడించారు.
				  																												
									  ప్రముఖ మ్యూజిక్ సంస్థ గానా నిర్వహించిన ‘కన్ఫెషన్స్ విత్ సన్నీ లియోన్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను చాలా సార్లు కట్టుబాట్లను ధిక్కరించాను.
				  తెలిసో తెలియకో అలా చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడూ నా కుటుంబానికి, నాకు ఉపయోగకరమైన నిర్ణయాలే తీసుకున్నాను. కచ్చితంగా నమ్మిన సిద్ధాంతాలనే అమలుచేశాను’ అని సన్నీ వివరించారు.
				  																																			
									  
	 
	తను ఈ మాటలు చెప్పడం ద్వారా చాలామందికి ఇటువంటి విషయాలు బయటకు చెప్పే ధైర్యం వస్తుందనే ఉద్దేశ్యంతోనే, తను ఈ విషయాలు వెల్లడించినట్లు ఆమె స్పష్టంచేశారు.
				  																		
											
									  తాను చేసే పనులను చాలామంది తప్పుబడుతుంటారని, అలా చేయడం పెద్ద కష్టం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు విషయం తెలియకుండా ఎదుటి వారు చేసేది తప్పో ఒప్పో మనం ఎలా చెప్తాం? అని సూటిగా ప్రశ్నించారు.