శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (09:52 IST)

మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఏది? పార్శిల్స్‌లో కూడా...

సాధారణంగా ఆలయానికి వెళ్లాలంటే ఎంతో నిష్టతో వెళతారు. శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి, ఎలాంటి మాంసాహారం తినకుండా భక్తిశ్రద్ధలతో వెళతారు. అయితే, దేశంలో ఏ ఆలయంలోని లేని వింత ఆచారం తమిళనాడులోని ఓ ఆలయంలో ఉంది. ఆ ఆలయానికి వచ్చే భక్తులకు చికెన్, మటన్ బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు. ఇలాంటి ఆలయంలో తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలోని వడకంపట్టి అనే గ్రామంలోవుంది. ఆ ఆలయం పేరు మునియాండి స్వామి ఆలయం. 
 
ఈ ఆలయానికి దేశంలో ఎక్కడా లేని లేని వింత ఆచారంతో పాటు విశిష్టత కూడా ఉంది. నిజానికి ఏ ఆలయానికి వెళ్లినా ప్రసాదంగా పులిహోరా, పొంగలి, వడపప్పు, లడ్డూ, కలకండ, కొబ్బరి ముక్కలు వంటివి ప్రసాదంగా ఇస్తారనీ. కానీ, ఈ ఆలయంలో మాత్రం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ.
 
ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉందిక్కడ.