ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (15:43 IST)

ఐబీ ఆఫీసర్ హత్య - లొంగిపోయిన ఆప్ బహిష్కృత నేత

ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరీ (ఐబీ) అధికారి అంకిత శర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆప్ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పోలీసులకు లొంగిపోయారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ వచ్చిన ఈయన.. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో హుస్సేన్‌ ముందస్తు బెయిల్‌ కోసం మంగళవారం దాఖలు చేసుకున్నారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారణను కోర్టు గురువారం విచారణ జరగాల్సివుండగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. 
 
గత నెల 24, 25 తేదీల్లో చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ నివాసం నుంచి ఘర్షణలు ప్రారంభమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. హుస్సేన్‌ ఇల్లు, ఫ్యాక్టరీ నుంచి యాసిడ్‌ సీసాలతో పాటు పెట్రోల్‌ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. 
 
హుస్సేన్‌ నివాసంపై నుంచి ఇతర నివాసాలపైకి పెట్రోల్‌ బాంబులను విసిరినట్లు పోలీసులు నిర్ధారించారు. అంకిత్‌ శర్మ ఫిబ్రవరి 26న హత్యకు గురయ్యారు. ఆయన శరీరంపై సుమారు 400 కత్తిపోట్లు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. శర్మ హత్య కేసులో హుస్సేన్‌కు సంబంధం ఉందని తేలడంతో.. ఆప్‌ నుంచి ఆయనను సస్పెండ్‌ చేశారు.