శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (12:25 IST)

ఐఎన్ఎస్ కరాంజ్ జలప్రవేశం

భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కరాంజ్‌ జలప్రవేశం చేసింది.

భారత నౌకాదళంలోకి మరో కొత్త జలాంతర్గామి ప్రవేశించింది. స్కార్పీన్‌ శ్రేణికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మూడో జలాంతర్గామి ఐఎన్ఎస్ కరాంజ్‌ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా, ఆయన సతీమణి రీనా లంబా జలాంతర్గామిని ప్రారంభించారు. నావికాదళంలోకి చేర్చడానికి ముందు ఒక యేడాది పాటు ఈ జలాంతర్గామిని క్షుణ్ణంగా పరీక్షించినట్టు సునీల్‌ లంబా తెలిపారు. 
 
ఈ జలాంతర్గామిని ముంబైలోని మజగావ్‌ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. ఈ సిరీస్‌లో భాగంగా, మొత్తం ఆరు జలాంతర్గాములను నిర్మించనున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నౌకల తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో జలాంతర్గాములను నిర్మిస్తున్నారు. అయితే, జలాంతర్గాముల తయారీ ప్రాజెక్టులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.