Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పారిజాత వృక్షంపై వైరల్ అవుతున్న సమాచారం.. ఏంటది?

సోమవారం, 29 జనవరి 2018 (11:46 IST)

Widgets Magazine

దశావతారాలలో పరిపూర్ణమైన అవతారాల్లో రామావతారం, కృష్ణావతారం కీలకం. సాక్షాత్తూ ఆ భగవంతుడే మానవుడిగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారం అయితే, మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం. యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు.
 
అలాంటి శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత పుష్పాన్ని దేవలోకం నుంచి తీసుకొచ్చిన కథ తెలిసిందే. ఈ పారిజాత వృక్షం యూపీలోని బారబంకి జిల్లాలోని కింటూరు గ్రామం వద్ద వుంది. ఈ పారిజాత వృక్షానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పారిజాత వృక్షం గురించి వైరల్ అవుతున్న సమాచారం ఏంటంటే..
 
ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా పారిజాత వృక్షాన్ని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ వృక్షపు శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. 
 
పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. ఈ వృక్షపు గొప్పతనం ఏంటంటే.. దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు. జూన్-జూలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

జడపదార్థం... అలసత్వం వుంటే ఏమవుతుందనడానికి ఇదే ఉదాహరణ...

పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుడ్ని గురించి చాలాకాలం తపస్సు చేసింది. చివరికి బ్రహ్మ ...

news

శ్రీవారి ఆలయంలో ఆధిపత్య పోరు.. రమణ దీక్షితులు Vs డాలర్ శేషాద్రి

శ్రీవారి ఆలయం కలియుగ వైకుంఠం, తిరుమల వెంకన్న సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుడు రమణ ...

news

శ్రీవారి చిన్న లడ్డూ ధర రూ.100కి పెరగనుందా?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు ...

news

శ్రీకృష్ణ పరమాత్మనే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన కర్ణుడి దానం....

ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో నూనెతో తలంటుకుంటున్నాడు. వజ్రవైఢూర్యాలు పొదిగిన పాత్రలో ...

Widgets Magazine