మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (18:44 IST)

మహిళా ఆఫీసర్లకు ఇండియన్ ఆర్మీలో #ColonelRank

భారతీయ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న అయిదుగురు మహిళా ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చింది. ఆ అయిదుగురికి కల్నల్ ర్యాంక్ (Colonel Rank ) ఇచ్చేందుకు సెలక్షన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మీలో 26 ఏళ్ల సేవ చేసినవారికి ఆ ర్యాంక్ ఇవ్వనున్నట్లు రక్షణశాఖ ఇవాళ తన ప్రకటనలో పేర్కొన్నది. తొలి సారి ఆర్మీలో కల్నల్ ర్యాంక్ సాధించిన ఆ మహిళా ఆఫీసర్లు వివరాలు ఇవే. 
 
లెఫ్టినెంట్ కల్నల్ సంగీతా సర్దానా (కార్ప్స్ ఆఫ్ స్నిగల్స్‌), లెఫ్టినెంట్ కల్నల్ సోనియా ఆనంద్‌, లెఫ్టినెంట్ కల్నల్ నవ్‌నీత్ దుగ్గల్ ( కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ), లెఫ్టినెంట్ కల్నల్ రీనూ ఖన్నా, లెఫ్టినెంట్ కల్నల్ రిచా సాగర్ (కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌).
 
కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్‌, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన శాఖల్లో మహిళా ఆఫీసర్లకు తొలిసారి కల్నల్ ర్యాంక్ దక్కినట్లు రక్షణశాఖ తన ప్రకనటలో పేర్కొన్నది. గతంలో ఆ ర్యాంక్‌ను కేవలం ఆర్మీ మెడికల్ కార్ప్స్‌, జడ్జి అడ్వకేట్ జనరల్‌, ఆర్మీ ఎడ్యుకేషన్ శాఖల్లోని మహిళా ఆఫీసర్లకు ఇచ్చారు.