సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (19:27 IST)

బాయ్‌ఫ్రెండ్ విషం తాగాడు.. అపస్మారక స్థితిలోకి గర్ల్ ఫ్రెండ్

Renu Nagar
సింగర్ రేణు నాగర్ తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. బాయ్‌ఫ్రెండ్ రవి శంకర్ (27) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన రేణు ఒక్కసారిగా షాక్‌కు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను మిట్టల్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. 
 
ఇండియన్ ఐడల్ సీజన్-10 ఫేమ్ రేణు బాయ్ ఫ్రెండ్ రవి గురువారం రాత్రి భరత్‌పూర్‌లో విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని అల్వార్‌లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు.
 
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రేణును మిట్టల్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోందని వైద్యులు తెలిపారు. రవికి ఇప్పటికే పెళ్లయింది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
రేణు ఇంటి వద్ద తబలా పాఠాలు నేర్చుకునేవాడు. రేణు-రవి కలిసి ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెను మాయచేసి తీసుకెళ్లాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.