సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 8 మే 2018 (17:24 IST)

పోకిరికి దేహశుద్ధి చేసిన బ్యాంకు ఉద్యోగిని (Video)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో పోకిరికి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మహిళా ఉద్యోగిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యా

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో పోకిరికి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగిని దేహశుద్ధి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మహిళా ఉద్యోగిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగినిగా పని చేస్తోంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బ్యాంకు రుణం కోసం ఆమెను సంప్రదించాడు. వారి మధ్య జరిగిన సంభాషణల తర్వాత వారిద్దరూ బ్యాంకు రుణంపై మాట్లాడుకునేందుకు ఫోన్ నంబర్లను పరప్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. 
 
ఆ తర్వాతగానీ ఆ పోకిరి వక్రబుద్ధి ఆమెకు తెలియరాలేదు. ఫోన్ నంబరు తీసుకున్న మరుసటి రోజు నుంచి ఆ అకతాయి ఆమెను ఫోనులో సతాయించడం, అసభ్యకర సందేశాలు పంపించడం, ప్రేమించాలని వేధించడం ఇలా చేయసాగాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ.. అకతాయికి వ్యక్తిగతంగా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ.. పోకిరి మారకపోవడంతో తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి అతన్ని పట్టుకుని నలుగురి మధ్య చితకబాదింది. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.