Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమృత జయలలిత కుమార్తెనా కాదా?: ఫిబ్రవరి 1న కోర్టులో విచారణ

శుక్రవారం, 19 జనవరి 2018 (15:09 IST)

Widgets Magazine

దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ అమృత తెరపైకి వచ్చింది. గతంలో తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమృత కేసు ఈ నెల 2న విచారణకు రానుంది. 
 
ఈ కేసులో డీఎన్ఏ ఒక్కటే కావడంతో అమృత హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సీసీఎంబీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీసీఎంబీ కోర్టు ఆదేశాల మేరకే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ కేసులో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలంటే.. అమ్మ అస్థికల డీఎన్ఏను సేకరించాలి. 
 
కానీ ఆ పని జరిగేలా కనిపించట్లేదు. దీంతో జయలలిత తోబుట్టువుల నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్ష చేసి అమృతను జయలలిత కుమార్తెనా లేదా అనేది పెద్ద విషయం కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పరీక్షలపై కోర్టు ఎలాంటి తీర్మానం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Jayalalithaa Daughter Dna Ccmb Amrutha Sarathy

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

అమరావతి : కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఈ ప్రభాకర్ ...

news

అన్నం కంటే బురద మట్టే ముద్దంటున్న శతాధిక వృద్ధుడు (వీడియో)

అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు ...

news

ఏపీ ప్రజలు గాజులు తొడుక్కుని కూర్చోలేదు : చంద్రబాబు

తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ...

news

థర్మామీటర్ పగిలిపోయింది.. క‌నురెప్ప‌పై పడిన నీటి తుంప‌ర గడ్డ‌క‌ట్టింది

కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ ...

Widgets Magazine