ఇషా అంబానీ తాళి విలువ ఎంతో తెలుసా?
భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ధనవంతుల జాబితాలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ వుంటారు. ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ఇటీవల ఇషా-ఆనంద్‌ల వివాహం ముంబైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకలో విశ్వవిఖ్యాతి గాంచిన ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సచిన్, అమితాబ్, రజనీకాంత్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
వేద పండితుల వేద మంత్రాల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆసియాలోనే అత్యధిక విలువతో కూడిన పెళ్లిగా ఇది రికార్డు సృష్టించింది. ఈ వివాహం నిమిత్తం రూ.700 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇషా తాళి విలువ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇషా అంబానీ ధరించిన తాళి విలువ రూ.90 కోట్లని తేలింది.