Widgets Magazine

కొనసాగుతున్న ఐటీ సోదాలు... శశికళ వంద బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

సోమవారం, 13 నవంబరు 2017 (12:36 IST)

sasikala

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే, గత ఐదు రోజులుగా మన్నార్గుడి మాఫియాను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో వీరంతా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడటమే కాకుండా, భారీ మొత్తంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు సాగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడుల్లో శశికళకు చెందిన సంస్థల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 20 డొల్ల కంపెనీలకు డబ్బులు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 
 
ఇందుకు సంబంధించిన వంద బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తొలిరోజు దాడుల్లో సుమారు వెయ్యి కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. రెండో రోజు దాడుల్లో వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండ సంపదను గుర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక మూడవరోజు పలు స్తిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Freezes Sasikala Bank Accounts Shell Companies It Raids

Loading comments ...

తెలుగు వార్తలు

news

#OsmaniaUniHYD ‏: ఆలుగడ్డ కర్రీలో జెర్రి...

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మహిళల హాస్టల్ మెస్‌లో తయారు చేసే వంటకాల్లో జెర్రులు, ...

news

ఇరాన్-ఇరాక్‌లలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు.. 150మంది మృతి

ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ ...

news

ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకివ్వాలి : వరుణ్ గాంధీ

పని చేయని, హామీలు నెరవేర్చని ఎంపీలు, ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ప్రజలకు ఇవ్వాలని ...

news

ఆవులను తరలిస్తున్నాడనీ చంపేశారు.. రాజస్థాన్‌లో దారుణం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో మరోమారు గో సంరక్షణ పేరుతో ఓ వ్యక్తిపై ...