Widgets Magazine

పెనుసంచలనం : జయ టీవీ, శశి ఆస్తులతోపాటు 184చోట్ల ఐటీ రైడ్స్

గురువారం, 9 నవంబరు 2017 (12:11 IST)

jayatv

ఐటీ రైడ్స్ తమిళనాడు పెనుసంచలనంగా మారాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థాపించిన జయ టీవీతోపాటు అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళతో పాటు ఏకంగా ఏకకాలంలో 184 చోట్ల ఈ సోదాలు జరిగాయి. శశికళ కుటుంబానికి చెందిన జాజ్‌ సినిమా థియేటర్‌పైనా ఐటీ దాడులు జరిగాయి.
 
గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ సోదాలు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శశికళ ఆస్తులు, ఆమె బంధువుల ఇళ్ళలో సాగుతున్నాయి. ముఖ్యంగా, జయలలిత ప్రారంభించిన ’జయ టీవీ’, అన్నాడీఎంకేకు చెందిన నమదు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అక్రమాస్తుల కేసులో శిశికళ దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఇదేసమయంలో ఈపీఎస్‌-ఓపీఎస్‌ ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే సర్కారుకు వ్యతిరేకంగా జయ టీవీ, పత్రిక ప్రభుత్వ వ్యతిరేక వార్తలతో విరుచుకుపడుతుంది. ఈ విషయంలో కొన్నాళ్లుగా విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. శశికళ బంధువులైన దినకరన్‌, దివాకరన్‌, ఇళవరసి, శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. 
 
అయితే ఇవాళ జరిగిన ట్యాక్స్ దాడులను జయ టీవీ ఖండించింది. ఇండిపెండెంట్ మీడియాపై ఇది దాడి అని ఆ సంస్థ పేర్కొంది. జయ టీవీ నెట్‌వర్క్ గ్రూపులో న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ ఛానళ్లు ఉన్నాయి. 1999లో తమిళనాడు దివంగత సీఎం జయలలిత జయ టీవీని స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం శశికళ ఫ్యామిలీ చేతిలో జయ నెట్‌వర్క్‌ ఉంది. అలాగే, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కూడా ఈ సోదాలపై స్పందించారు. తన నివాసంలో ఐటీ దాడులు జరగలేదని స్పష్టంచేశారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ రాసలీలలు.. అరెస్టు

హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ రాసలీలలు బహిర్గతమయ్యాయి. పెళ్లి చేసుకుంటానంటూ ఓ ...

news

జగన్ ముద్దులకు భయపడి మహిళలు పారిపోతున్నారు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి జవహర్ సెటైర్లు విసిరారు. ప్రజా సంకల్ప యాత్ర ...

news

70 ఏళ్ల వయసులో నీకు 25 ఏళ్ల యువతి కావాలా? వృద్ధ కోటీశ్వరుడిపై సెటైర్లు

ఆయనకు 70 ఏళ్లు. భార్య చనిపోయింది. ఆయన పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ కోట్ల రూపాయల ...

news

29న టిడిపిలోకి వాణీ విశ్వనాథ్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చినబాబు

తెలుగుదేశం పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో పాటు ...

Widgets Magazine