Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

70 ఏళ్ల వయసులో నీకు 25 ఏళ్ల యువతి కావాలా? వృద్ధ కోటీశ్వరుడిపై సెటైర్లు

గురువారం, 9 నవంబరు 2017 (11:13 IST)

Widgets Magazine
rajesh kumar-wife

ఆయనకు 70 ఏళ్లు. భార్య చనిపోయింది. ఆయన పిల్లలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. కానీ కోట్ల రూపాయల ఆస్తి... చిటికేస్తే నౌకర్లు, కార్లు వచ్చేస్తాయి. కానీ తనకు మాత్రం మరో ఆలోచన వచ్చింది. మరణించేవరకూ తనకు తోడుగా వుండేందుకు ఓ స్త్రీ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచనైతే బాగానే వుంది కానీ ఆయన చేసిన పనిపైనే ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే... అస్సాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజేష్ కుమార్. ఆయన తనకంటే వయసులో 45 ఏళ్ల చిన్నదైన యువతిని పెళ్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి వున్న ఫోటోను సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ ఫోటోపై నెటిజన్లు కామెంట్ చేస్తూ పెద్దాయన తప్పు చేశారని పేర్కొంటున్నారు. 
 
70 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువతిని పెళ్లాడి ఆమె జీవితాన్ని నాశనం చేశావని తిడుతున్నారు. పెళ్లాడాలని వుంటే విడాకులు తీసుకున్న మహిళనో లేదంటో నీ వయసుకు ఐదారేళ్లు తేడా వున్న మహిళనో పెళ్లాడవచ్చు కదా. యువతి గొంతు కోశావు అంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే ఆ 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిని యువతి కేవలం అతడి కోట్ల ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నదనీ, అంతేతప్ప మరొకటి కాదని పోస్ట్ చేస్తున్నారు. 
 
అంతేకాదు ఆయనకు సన్నిహితంగా వున్న ఓ కుటుంబం కూడా ఆయన చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజేష్ అంకుల్ చేసిన పని ఏమాత్రం బాగాలేదు. ఆయన కోడలు కంటే చిన్న వయసు వున్న యువతిని పెళ్లి చేసుకుని ఏం చేయాలని. ఆయన నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. దేశంలో ఎందరో ఆదరణ లేని మహిళలు వున్నారనీ, అలాంటివారిలో ఎవరినో ఒకరిని తన వయసుకు తగినవారిని పెళ్లాడి వుంటే బావుండేదని పేర్కొన్నారు. మరి ఈ వృద్ధ వ్యాపారవేత్త నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

29న టిడిపిలోకి వాణీ విశ్వనాథ్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చినబాబు

తెలుగుదేశం పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో పాటు ...

news

చేవెళ్ల నుంచి రేవంత్ పాదయాత్ర.. రాములమ్మ కూడా..?

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డి.. త్వరలో పాదయాత్ర ...

news

భారత్‌లో మతస్వేచ్ఛ లేదు.. ముస్లిం, క్రైస్తవులపై దాడులు: అమెరికా

భారత్‌లో మతస్వేచ్ఛ కరువైందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. క్రైస్తవులపై దాడులు ...

news

#JayaTV : జయ టీవీ - దినకరన్‌లకు షాక్.. ఐటీ దాడులు...

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన 'జయ టీవీ'కి ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు షాక్‌ ...

Widgets Magazine