మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (16:11 IST)

"కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!" ఓ పాకిస్థాన్ పోలీసు ప్రతిపాదన

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగిపోతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఓ పాకిస్థాన్ పోలీసు కోహ్లీకి ఓ ప్రతిపాద

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య పెరిగిపోతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఓ పాకిస్థాన్ పోలీసు కోహ్లీకి ఓ ప్రతిపాదన చేశాడు. నిజంగా అతని నుంచి పెళ్లి ప్రతిపాదన వస్తుందని ఊహించలేదు. ఇంతకీ ఆ పురుష పోలీసు నుంచి వచ్చిన ప్రతిపాదన ఏంటో ఓసారి పరిశీలిస్తే...
 
ఇండిపెండెన్స్ కప్ ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లిన ప్రపంచ ఎలెవెన్ జట్టులో భారత ఆటగాళ్లు ధోనీ, కోహ్లీ వెళ్లకపోవడం అక్కడి అభిమానుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లను పాక్‌లో ఎలా మిస్ అవుతున్నామో చెప్పేందుకు చాలామంది ట్విటర్‌లో పెద్దఎత్తున పోస్టులు కుమ్మరించారు.
 
హృదయాన్ని తాకే సందేశాలతో పాటు లాహోర్ స్టేడియం వేదికగా అభిమానులు పలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫోటోలు అప్‌లోడ్ చేశారు. అన్ని మెసేజ్‌లు, ఫోటోలకంటే ఓ ఫోటో మాత్రం ఇంటర్నెట్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఓ పాకిస్థాన్ పోలీసు "కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో..!" అని ఓ ప్లకార్డుపై రాసి ప్రదర్శించారు. దీన్ని ఎవరో పోటోతీసి అలా ట్విటర్లో పెట్టారో లేదో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు షేర్ చేసుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
 
అయితే పాకిస్థాన్‌లో క్రికెట్‌పై ఉన్న ప్రేమ, భారత క్రికెటర్లపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని... అక్కడి అధికారులు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకోవాలని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.