బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (11:39 IST)

కఠినంగా ప్రాక్టీస్ చేస్తే.. మరో పదేళ్లే కెరీర్‌ను కొనసాగిస్తా: విరాట్ కోహ్లీ

తాను కనుక ఫిట్‌గా వుంటే మరో పదేళ్లు తన కెరీర్‌ను కొనసాగిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మరో రెండు నెలల్లో 29వ ఏట అడుగుపెడుతున్న కోహ్లీ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమలో చాలా

తాను కనుక ఫిట్‌గా వుంటే మరో పదేళ్లు తన కెరీర్‌ను కొనసాగిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మరో రెండు నెలల్లో 29వ ఏట అడుగుపెడుతున్న కోహ్లీ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమలో చాలామందికి ఈ కెరీర్‌లో ఎంతకాలం కొనసాగుతామనే విషయంలో క్లారిటీ వుండదన్నాడు. కానీ తన విషయానికి వస్తే.. ఇప్పటికంటే మరింత కఠినంగా శిక్షణ తీసుకుంటే మరో పదేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు. 
 
ఇదిలా ఉంటే.. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూపుతో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ (వీకేఎఫ్) చేతులు కలిపింది. క్షేత్రస్థాయిలో ఎవరైతే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తారో అటువంటి వారికి స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.2కోట్లు ఖర్చు చేయనున్నారు. 
 
అయితే అథ్లెట్ల ప్రదర్శన బట్టి ఈ మొత్తం పెరుగుగుతుందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. క్రికెట్ లేకుండా తానేమీ చేయలేనని.. క్రికెట్ ద్వారానే తానీస్థాయికి వచ్చానని తెలిపారు. కోహ్లీ ఇప్పటి వరకు 60 టెస్టుల్లో 4658 పరుగులు చేశాడు. 194 వన్డేల్లో 8587 పరుగులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.