శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (17:14 IST)

పీవోకే పాకిస్థాన్ దే: నటుడు రిషి కపూర్ సంచలన ట్వీట్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌లో భూభాగమంటూ నిన్నటికి నిన్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూ

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌లో భూభాగమంటూ నిన్నటికి నిన్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్‌దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు.
 
"ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. జమ్మూకాశ్మీర్ మనది. పీవోకే వారిది. ఇదే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్‌ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్‌లోకి వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ" అంటూ రిషి కపూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.