ముమ్మాటికీ పీఓకే పాకిస్థాన్‌దే : ఫరూక్ అబ్దుల్లా

ఆదివారం, 12 నవంబరు 2017 (14:02 IST)

farook abdullah

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ పాకిస్థాన్‌కు చెందిన భూభాగమన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం పాకిస్థాన్‌ది. ఇందులో ఎలాంటి సంకోచం లేదు. ఇంకా ఎన్ని సార్లు భారత్, పాకిస్థాన్ యుద్ధాలకు దిగుతాయి అని ప్రశ్నించారు. వేర్పాటువాదులు తరుచుగా కాశ్మీర్‌కు స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నారని, కాశ్మీర్ చుట్టూ ఉన్న భారత్, పాకిస్థాన్, చైనా మూడు అణ్వాయుధ దేశాలేనని అలాంటప్పుడు స్వాతంత్య్రం ఎందుకని ప్రశ్నించారు. 
 
కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలంటూ పోరాడటం వృథా అని, స్వాతంత్య్రంతో ఒరిగేదేమీ ఉండదన్నారు. కాశ్మీర్ చుట్టూ మూడు అణ్వాయుధ దేశాలున్నాయని (భారత్, పాకిస్థాన్, చైనా) అలాంటప్పుడు స్వాతంత్య్రం వచ్చినా ఒక్కటే, రాకున్నా ఒక్కటే అని అభిప్రాయడ్డారు. 
 
భారత్‌లో కాశ్మీర్ విలీనం గురించి ఎప్పుడో నిర్ణయం జరిగింది. కానీ కాశ్మీరీయుల ప్రేమను మాత్రం భారత్ గుర్తించలేదు. కాశ్మీర్‌లో ప్రస్తుత అనిశ్చితికి ఇదే కారణమన్నారు. కాశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్‌తో ముడిపడి ఉన్న నేపథ్యంలో భారత్ పొరుగుదేశమైన పాక్‌తో చర్చలు జరుపాలని కోరారు. దీనిపై మరింత చదవండి :  
Pakistan China Farooq Abdullah Pak-occupied Kashmir

Loading comments ...

తెలుగు వార్తలు

news

#Sasikala : నేలమాళిగల్లో గుట్టలుగా డబ్బు, వజ్రాభరణాలు!

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత నేత టీటీవీ దినకరన్, వారి కుటుంబీకులు, ...

news

#AndhraPradesh : గుంటూరులో కుప్పకూలిన భవనం (వీడియో)

గుంటూరులో ఓ భవనం కుప్పకూలిపోయింది. జిల్లా కేంద్రంలోని నందివెలుగు సెంటర్‌లో శనివారం రోడ్డు ...

news

మరిదితో అక్రమ సంబంధం... పరువు హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో పరువు హత్య జరిగింది. సత్వతి (24) అనే మహిళను కన్నతండ్రి, సొంత ...

news

బిడ్డకు పాలిస్తున్నా ఈడ్చుకెళ్లారు....

నో పార్కింగ్ జోన్‌లో పార్కింగ్ చేసివున్న కారులో కూర్చొని ఓ మహిళ తన బిడ్డకు పాలిస్తోంది. ...