శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (13:09 IST)

అమ్మ శశికళ... జయ టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా ఫేక్ వీడియో సృష్టి?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మృతి కేసులోని నిజాలను నిగ్గుతేల్చే పనిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి ఏకసభ్య కమిషన్ నిమగ్నమైవుంది. ఇప్పటికే అనేక

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత మృతి కేసులోని నిజాలను నిగ్గుతేల్చే పనిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి ఏకసభ్య కమిషన్ నిమగ్నమైవుంది. ఇప్పటికే అనేక మంది వద్ద విచారణ జరిపిన ఈ కమిషన్.. ఇపుడు జయలలిత చికిత్స పొందిన చెన్నై, అపోలో ఆస్పత్రిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
 
ముఖ్యంగా, జయలలిత చికిత్స పొందిన వార్డును కమిషన్ కార్యదర్శి కోమల తాజాగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఓ విషయాన్ని గుర్తించారు. జయలలిత టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా విడుదలైన వీడియో నకిలీదనే వార్తలు వస్తున్నాయి. జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిని కమిషన్ కార్యదర్శి కోమల ఆదివారం సందర్శించారు. 
 
ఈ సందర్భంగా జయలలిత చికిత్స పొందిన ఐసీయూలోకి వెళ్లిన ఆమె ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేక గదిలో జయ చికిత్స పొందుతున్నప్పుడు శశికళ ఓ వీడియోను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో జయ టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా ఉంది.
 
అయితే, ఈ వీడియో నకిలీదని కోమల గుర్తించినట్టు సమాచారం. జయ పడుకున్న మంచానికి ఎదురుగా ద్వారం మాత్రమే ఉండడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. జయ చికిత్స పొందుతున్న మంచానికి ఎదురుగా ఉన్న గోడకు టీవీ అమర్చే అవకాశమే లేదని ఆమె గుర్తించారు. దీంతో ఆ వీడియో నకిలీదని తేలిందని కోమల అంటున్నారు. పలు కోణాల్లో నిర్వహించిన దర్యాప్తులోనూ అది నకిలీదని తేలిందని ఆమె వెల్లడించారు.