జయలలిత ఐస్‌క్రీమ్ తిన్నారు.. షుగర్ లెవల్స్ పెరిగిపోయాయ్: అపోలో రిపోర్ట్

గురువారం, 28 సెప్టెంబరు 2017 (17:52 IST)

jayalalithaa

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి 9నెలలు దాటిపోతున్నా ఆమె మృతి పట్ల ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. జయ మృతిపై వందల ప్రశ్నలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. జయ మృతి వెనుక ఏదో కుట్ర ఉందని నమ్మేవాళ్లే ఎక్కువ. జయ మరణం తర్వాత శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌ సైతం అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తంచేశారు. జయ మృతి వెనుక శశికళ కుట్ర ఉందని ఆరోపిస్తూ వచ్చిన పన్నీర్‌ సెల్వం సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. 
 
పన్నీర్‌ తరహాలోనే మంత్రి శ్రీనివాసన్‌ కూడా జయలలిత మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 22న తీవ్ర అస్వస్థతతో... అపోలో ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై తామంతా అబద్దాలు చెప్పామని అన్నారు. అపోలో ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి చనిపోయేవరకూ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదన్నారు. అయితే అపోలోలో చికిత్స పొందిన జయలలితకు సంబంధించిన వీడియోలు తమ వద్ద వున్నాయని శశికళ మేనల్లుడు దినకరన్ వెల్లడించారు. ఆ వీడియోలో అమ్మ నైటీలో వుండటం వల్లే విడుదల చేయలేదన్నారు. 
 
తాజాగా, అపోలో ఆస్పత్రి బృందం విడుదల చేసిన జయలలిత మెడికల్ రిపోర్టులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. జయలలిత న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరారని అపోలో స్పష్టం చేసింది. ఐస్‌క్రీమ్స్‌ తినడం ద్వారా షుగర్‌ లెవల్స్‌ పెరిగాయని అపోలో సిబ్బంది తెలిపారు. 
 
ఆస్పత్రిలో చేరినప్పుడు జయ ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని రిపోర్టులో పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే స్పృహలోకి వచ్చిన జయలలిత, రెండు వారాల పాటు స్పృహలోనే ఉన్నారని అపోలో తెలిపింది. ఆ తర్వాతే ఆమె ఆరోగ్యం విషమించిందని రిపోర్టులో అపోలో వైద్యులు స్పష్టం చేశారు.దీనిపై మరింత చదవండి :  
Jayalalithaa Death Mystery Apollo Hospitals Report Out Aiadmk Leader Tamil Nadu Ttv Dhinakaran Vk Sasi Kala

Loading comments ...

తెలుగు వార్తలు

news

హనీప్రీత్ సింగ్ లొంగిపోయిందా? ఐడియా ఇచ్చింది ఎవరు?

డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నట్లు ...

news

ప్రియుడు కోరాడని ఫ్రెండ్స్ నగ్న ఫోటోలను పంపింది.. చివరికి ఆత్మహత్య చేసుకుంది...

తన ప్రేమికుడు కోరాడని.. తన హాస్టల్ రూమ్ మేట్స్ నగ్న చిత్రాలను అతనికి పంపిన ఓ యువతి తన ...

news

విమానం మిస్సైంది.. డ్యాన్స్ చేస్తూ టైమ్ ఎలా గడిపిందంటే? (వీడియో)

విమానం మిస్సైంది. తాను ఎక్కాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్లిపోవడంతో మహ్షీద్ మజూజీ అనే యువతి ...

news

హోమాల పేరిట మహిళలను లొంగదీసుకునేవాడు.. టీవీల్లో జాతకం చెప్పే బాబా అరెస్ట్

దొంగబాబాల గుట్టు రట్టు అవుతుంది. ఇప్పటికే డేరా బాబా వంటి స్వామీజీల గుట్టు రట్టు అయ్యింది. ...