Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడులో ఉద్రిక్తత.. కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది.. అమ్మ నైట్ డ్రెస్‌లో వుండటంతో?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:29 IST)

Widgets Magazine

తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం కూడా విషమించింది. దీంతోపాటు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నైకి చేరుకున్నారు. దీంతో ఏదో జరుగబోతుందనే అనుమానం తమిళనాట నెలకొంది. 
 
ఇదే సమయంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు హై అలెర్ట్ ఉత్తర్వులను డీజీపీ రాజేంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కూడా సెలవులను రద్దు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
మరోవైపు తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ అమ్మను అపోలో ఆస్పత్రిలో చూడలేదని.. శశికళవర్గం ఆమెను చూడనివ్వలేదని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఉన్న రహస్యాలేంటో నిగ్గు తేల్చే విషయంలో ఎట్టకేలకు తమిళనాడు సర్కారు ముందడుగు వేసింది. 
 
జయలలిత చికిత్సకు సంబందించిన వివరాలని, మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామితో తమిళనాడు ప్రభుత్వం కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికని అందించనుంది.
 
ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ అక్క కొడుకు దినకరన్ ప్రభుత్వం కమిటీని నియమించడంపై స్పందించారు. జయలలిత మరణంపై ప్రభుత్వం ఎలాంటి విచారణ జరిపినా తనకు అభ్యంతరం లేదని.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు దినకరన్ అన్నారు.
 
కాగా.. అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్సకు సంబందించిన వీడియో తనవద్ద ఉందని దినకరన్ అన్నారు. ఆ వీడియోలో జయలలిత నైట్ డ్రెస్‌లో ఉండటంచో బయటకు విడుదల చేయడం సబబు కాదనిపించినట్లు దినకరన్ చెప్పారు. అవసరమైతే ఆ వీడియోని కమిటీ సభ్యులకు అందజేస్తానని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజకీయనేత నిజాయితీగా ఉంటే ఎన్నో కష్టాలు : రాహుల్ గాంధీ

'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ...

news

రైతుల్లా నటిస్తున్నారు.. వాళ్లే టార్గెట్.. పాక్ సరిహద్దుల్లో "ఆపరేషన్ అర్జున్"

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు బీఎస్ఎఫ్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ ...

news

రెడీ.. వన్.. టు.. త్రీ... కిమ్‌పై సైనిక చర్యకు సిద్ధం : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. ప్రపంచ దేశాలను ధిక్కరిస్తున్న ఉత్తర ...

news

భక్తురాలి సాయంతో యువతిపై కీచక బాబా అత్యాచారం...

మహిళా భక్తురాలి సహాయంతో ఓ కీచక బాబా మరో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి తాజాగా ...

Widgets Magazine