శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

ట్రంప్ ‌- కిమ్‌ల గొడవ నర్సరీ పిల్లల అల్లరి పోరాటం : రష్యా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కింగ్ జాంగ్ ఉన్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై రష్యా స్పందించింది. ట్రంప్ - కిమ్‌ల గొడవ నర్సరీ పిల్లల పోరాటంలా ఉందని వ్యాఖ్యానించింది. అదేసమయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కింగ్ జాంగ్ ఉన్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై రష్యా స్పందించింది. ట్రంప్ - కిమ్‌ల గొడవ నర్సరీ పిల్లల పోరాటంలా ఉందని వ్యాఖ్యానించింది. అదేసమయంలో అమెరికా ఎన్ని భీకరాలు పలికినా.. ఉ.కొరియాపై దాడి చేయలేదని జోస్యం చెప్పింది. 
 
ఇదే అంశంపై రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ ఆదివారం ఓ టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్యాంగ్యాంగ్‌పై అమెరికా దాడి చేయలేదు. ఎందుకంటే.. ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయనే విషయం వారికి తెలుసు. నేను ఉ.కొరియాకు మద్దతు ఇవ్వడం లేదు. కానీ, నేను చేసిన వ్యాఖ్యలను అందరూ అంగీకరిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. 
 
సామరస్యంగానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. అలా కాకుండా బెదిరింపులు, దాడులకు దిగితే ఉ.కొరియాలోనే కాకుండా ద.కొరియా, జపాన్‌, రష్యా, చైనా దేశాల్లోని ఎంతో మంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.