Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్లైట్‌ను గాలికి వదిలేసి.. కాక్‌పిట్‌లో తన్నుకున్న పైలట్లు

గురువారం, 4 జనవరి 2018 (11:19 IST)

Widgets Magazine
jet air

కొందరు పైలట్లు క్షణికావేశానికి లోనవుతుంటారు. ఇలాంటివారి వల్ల విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఇద్దరు పైలట్లు తాము నడుపుతున్న ఫ్లైట్‌ను గాలికి వదిలేసి కాక్‌పిట్‌లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన జెట్ ఎయిర్‌వేస్ విమానం 324 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ముంబై బయలుదేరింది. సమాచార మార్పిడిలో లోపం కారణంగా కాక్‌పిట్‌లోని పైలట్ల మధ్య వివాదం తలెత్తింది. తొలుత చిన్నగా మొదలైన వాగ్వాదం చివరికి బాహాబాహీకి దారి తీసింది. 
 
ఈ ఇద్దరు పైలట్లు విమానాన్ని పట్టించుకోకుండా ఘర్షణకు దిగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే కాసేపటికే పైలట్ల మధ్య వివాదం సమసిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. పైలట్లు గొడవకు దిగడం నిజమేనని జెట్ ఎయిర్‌వేస్ ధ్రువీకరించింది. ఘర్షణకు దిగిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించి, విచారణకు ఆదేశించినట్టు పేర్కొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

"ఆ" లింకు పెట్టుకున్న యువకుడితో వివాహానికి సమ్మతించిన భర్త

సాధారణంగా వివాహమైన తర్వాత భార్యలు ఉండగానే భర్తలు రెండో వివాహం చేసుకోవడం చూస్తున్నాం. ...

news

జయలలిత శరీరంలోకి ఐదున్నర లీటర్ల రసాయనాలు...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి ఓ మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించేందుకు జస్టీస్ ...

news

తలైవర్‌తో తలైవా : కరుణ ఆశీస్సులందుకున్నా : రజనీకాంత్

తమిళ తలైవర్‌తో తలైవా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ...

news

గర్ల్‌‍ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు... ఎమ్మెల్యేనంటూ సర్క్యూట్ హౌస్‌లో రూమ్

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి బండారం బయటపడింది. ఇంతకాలం భార్యకు తెలియకుండా ...

Widgets Magazine