శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (11:55 IST)

కోలీవుడ్ హీరోల సరసన సాయిపల్లవి.. శర్వానంద్‌‌తో ఫిదా హీరోయిన్..

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త సినిమాలో నటించేందుకు సంతకాలు చేసింది. మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేసి హిట్ కొట్టిన శర్వానంద్, తన తదుపరి సినిమాను

కోలీవుడ్‌లో సూర్య, ధనుష్ సరసన నటిస్తున్న సాయిపల్లవి.. తెలుగులో శర్వానంద్‌తో కొత్త సినిమాలో నటించేందుకు సంతకాలు చేసింది. మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేసి హిట్ కొట్టిన శర్వానంద్, తన తదుపరి సినిమాను హను రాఘవపూడితో చేయనున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇందులోని సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సినీ యూనిట్ అంటోంది. 
 
ఇలాంటి ఫైట్స్, శర్వానంద్ సినిమాల్లో ఎక్కడా కనిపించవని.. తొలిసారి శర్వానంద్ భారీ ఫైట్స్ చేస్తున్నారని టాక్ వస్తోంది. ఈ సినిమాలో శర్వా జోడీగా సాయిపల్లవి నటించనుంది. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా పండుతాయని సమాచారం.
 
ఈ సినిమా షెడ్యూల్ నేపాల్‌లో జరుపనున్నట్లు సినీ యూనిట్ తెలిపింది. ఒక వైపున 'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా చేస్తుంటే, మరో వైపున శర్వానంద్ కూడా అదే విధమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ మాదిరిగానే మరింత ఫిట్ నెస్ ను సాధించడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు.